Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2015 13:23:35
facebook Twitter Googleplus
Photo

సినిమాకు హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయినా సుబ్రమణ్యంను చూసి అయ్యో పాపం అనుకోవడమేంటి? కానీ తప్పట్లేదు మరి. తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బాగానే ఉన్నాయి కానీ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికాలోనే కుర్రాడి పరిస్థితి ఏమీ బాగా లేదు. మూడు వారాల కిందట వచ్చిన ?భలే భలే మగాడివోయ్? అమెరికాలో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఓ రెండు కోట్లు వసూలు చేస్తే ఎక్కువనుకుంటే ఆ సినిమా ఏకంగా మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టింది. నాని ఏమీ స్టార్ హీరో కాదు.. మారుతి కూడా స్టార్ డైరెక్టర్ కాదు. మరి అలాంటి సినిమాకే ఆ స్థాయిలో వసూళ్లు వస్తే.. ఓ స్టార్ డైరెక్టర్ స్టార్ అయ్యే దశలో ఉన్న హీరో కలిస్తే మరింతగా కలెక్షన్లు వస్తాయని అంతా అనుకున్నారు.

కానీ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకు యుఎస్ లో రెస్పాన్స్ చాలా పూర్ గా ఉంది. అక్కడ తొలి రోజు ఈ సినిమాకు కేవలం 8 వేల డాలర్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసినా జనాల్లో పెద్దగా రెస్పాన్స్ లేదు. జనాల్లో ఆసక్తి ఉన్న కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు సమయానికి షోలు వేయకపోవడం కూడా కలెక్షన్లు తగ్గడానికి కారణమైంది. మొత్తానికి ?సుబ్రమణ్యం ఫర్ సేల్? టీంకి అమెరికా కలెక్షన్స్ షాకిస్తున్నాయి. భలే భలే..కు వచ్చిన రెస్పాన్స్ చూసి తన సినిమాను దిల్ రాజు అమెరికాలో భారీగానే రిలీజ్ చేశాడు. వందకు పైగా స్క్రీన్స్ తీసుకున్నాడు. కానీ రెస్పాన్స్ చూసి దిమ్మదిరిగిపోయింది. యుఎస్ కలెక్షన్లలో సగం ఖర్చులకే పోతుంది. మరి తొలి రోజు వచ్చిన కలెక్షన్లు చూస్తే సుబ్రమణ్యం చివరికి రాజుకు ఎంత మిగులుస్తాడో అని సందేహాలు కలుగుతున్నాయి. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో శని ఆది వారాల్లోనైనా సుబ్రమణ్యం జోరు పెరుగుతుందేమో చూడాలి.

,  ,  ,  ,