Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 11:33:36
facebook Twitter Googleplus
Photo

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆయన ?జ్యో అచ్యుతానంద? అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా శ్రీనివాస్ మార్క్‌ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని మొదట్నుంచీ మంచి ప్రచారం పొందుతోంది.
ఇక ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చకచకా పూర్తి చేసుకుంటోంది. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో రెజీనా జ్యోత్స్న అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ కోడూరి అందించిన ఆడియో త్వరలోనే విడుదల కానుంది. ఇక సినిమాను కూడా ఆగష్టు నెలాఖర్లో విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,