Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2017 12:10:09
facebook Twitter Googleplus
Photo

ప్రపంచంలో ఎక్కడ సినిమాలు తీసినా కూడా.. అవి జేమ్్స బాండ్ సినిమాలు అయినా కూడా.. అసలు భారీ యాక్షన్ స్టంట్లన్నీ కూడా హీరోలే చేయరు. ఎందుకంటే ప్రతీ పనికీ డూపులు ఉంటారు. హీరోలు పెద్ద పెద్ద బిల్డింగులు దూకాలంటే డూపులు.. హీరోయిన్లు న్యూడ్ గా కనిపించాలంటే న్యూడులు.. దాదాపు ఇండియాలో కూడా అంతే. అయితే కొందరు హీరోలు మాత్రం తమ స్టంట్లు తామే చేస్తాం అంటూ బెట్టుచేస్తుంటారు.

మొన్న 11వ తారీఖు నుండి ఏకంగా 40 రోజుల పాటు తమ సినిమాను షూట్ చేయడానికి బాలయ్య అండ్ పూరి జగన్ పోర్చుగల్ దేశం వెళ్లారు. అక్కడే కొన్ని పాటలను తీసిన.. ఆ తరువాత శ్రీయను ఇంటికి పంపేసి యాక్షన్ సీన్లు తీస్తున్నారు. ఈ యాక్షన్ సీన్లలో ఒక హెలికాప్టర్ చేజ్ సీన్ కూడా ఉందట. ఈ సీన్ కోసం కాస్త హైట్ నుండి చాపర్ లోపల నుండి దూకేసే సీన్లన్నీ సొంతంగానే చేస్తున్నాడట బాలయ్య. సార్ డూపును పెట్టుకుందాం అంటే.. అబ్బే అక్కర్లేదు అంటూ మొండికేస్తున్నాడట. ఆల్రెడీ వయస్సు 56 ఏళ్లు టచ్ అయిపోవడంతో.. ఈయన గురించి యునిట్ అంతా వర్రీ అవుతున్నా కూడా.. బాలయ్య మాత్రం పట్టించుకోవట్లేదని టాక్.

ఈ సినిమా కోసం 'ఉస్తాద్' అనే టైటిల్ పై ఆసక్తి చూపిస్తున్న బాలయ్య.. బాక్సాఫీస్ దగ్గర ఉస్తాదే.

,  ,  ,  ,  ,  ,