Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 11:52:05
facebook Twitter Googleplus
Photo

సినిమా మొదలైన రోజే అందరు ఆ సినిమా గురించి ఎంతో ఆసక్తిని చూపారు. రిలీజ్ అయిన తర్వాత మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికంటే ఎక్కువ స్థాయిలో దర్శకుడు రాజమౌళి - బాహుబలి సెకండ్ పార్ట్ ని తెరకెక్కించాడు. సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అత్యధిక వసూళ్లను రాబట్టింది.

ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన బాహుబలి- ది కంక్లూజన్ ఇండియాలో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ కూడా బాహుబలి దగ్గర తలవంచక తప్పలేదు. ఇటువైపు కూడా చూడని బాలీవుడ్ అగ్రనటులు బాహుబలితో ఒక్కసారిగా చూపును ఇటువైపు మళ్లించారు. అక్కడి మీడియా కూడా టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచడం మొదలు పెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ఈ నెల 8న ఆదివారం బుల్లి తెరపై సందడి చేయనుంది

తెలుగు స్టార్ మా లో సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అదే రోజు ఇతర భాషల చానెళ్లు కూడా బాహుబలి ని ప్రసారం చేయనున్నాయి. హిందీ వెర్షన్ సోనీ మాక్స్ ఛానెల్ లో తెలుగులో కంటే ముందుగానే 1 గంటలకు స్టార్ట్ అవ్వనుంది. తమిళ్ అయితే 3 గంటలకు ప్రసారం అవ్వనుంది.

,  ,  ,  ,  ,