Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2017 16:38:05
facebook Twitter Googleplus
Photo

తెలుగులో పెద్ద హీరోల సినిమాలు నైజాంలో రూ.15 కోట్ల షేర్ మార్కును టచ్ చేయడానికి కష్టపడుతున్న టైంలో దిల్ రాజు.. బాహుబలి-1 మీద రూ.23 కోట్ల దాకా పెట్టుబడి పెట్టడం చూసి ఔరా అనుకున్నారు. ఆయన చాలా పెద్ద రిస్క్ చేశాడన్నారు. కానీ ఆ సినిమా ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించిందో తెలిసిందే. నైజాం ఏరియాలో రూ.45 కోట్ల దాకా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ జనాల్ని విస్మయానికి గురిచేసింది ది బిగినింగ్. మిగతా ఏరియాలన్నింట్లోనూ ఇలాగే అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. దీంతో రెండో భాగానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఏరియాలోనూ రికార్డు స్థాయిలో.. అనూహ్యమైన రేట్లు పలికాయి ది కంక్లూజన్ హక్కులు. తొలి భాగంతో పోలిస్తే ఈ రేట్లు రెట్టింపుగా ఉండటం విశేషం.

టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం నైజాం ఏరియాకు బాహుబలి: ది కంక్లూజన్ హక్కుల కోసం రూ.45 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. అంటే తొలి భాగంతో పోలిస్తే హైక్ రూ.22 కోట్లన్నమాట. సీడెడ్ రైట్స్ రూ.25 కోట్లు (బాహుబలి-1కు రూ.13 కోట్లు) పలికాయి. ఉత్తరాంధ్రకు తొలి భాగం హక్కులు రూ.7 కోట్లు పలికితే.. ఇప్పుడవి రూ.13 కోట్లయ్యాయి. తూర్పు గోదావరి హక్కులు రూ.5 కోట్ల నుంచి రూ.11 కోట్లకు.. పశ్చిమగోదావరి రైట్స్ రూ.4.5 కోట్ల నుంచి రూ.9.5 కోట్లకు పెరిగాయి. కృష్ణాకు రూ.9 కోట్లకు.. గుంటూరుకు రూ.12 కోట్లకు.. నెల్లూరుకు రూ.5.5 కోట్లకు రైట్స్ అమ్మారు. తొలి భాగానికి వరుసగా ఇవి రూ.4 కోట్లు.. రూ.6 కోట్లు.. రూ.3.5 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా రెండో భాగానికి తెలుగు రాష్ట్రాల వరకే రూ.130 కోట్ల బిజినెస్ జరగడం విశేషం.

,  ,  ,  ,  ,