Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:10:56
facebook Twitter Googleplus
Photo

10 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు.. ఇప్పటికే 1300 కోట్లు దాటిన గ్రాస్ కలెక్షన్స్.. ఫుల్ రన్ లో 1500 కోట్ల మార్క్ ను ఖచ్చితంగా అందుకుంటుందనే అంచనాలు.. ఇదీ బాహుబలి2 ది కంక్లూజన్ రికార్డుల ధమాకా. ఇంతటి స్థాయి రికార్డును ఇప్పట్లో బ్రేక్ చేయడం అసాధ్యం అని వేసిన అంచనాలు అప్పుడే తారుమారు అయిపోయేటట్లుగా ఉన్నాయి.

దంగల్ రూపంలో బాహుబలి2 రికార్డులకు డేంజర్ ఎదురైంది. చైనాలో అనూహ్య స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. అక్కడి మార్కెట్లో 10 రోజులు గడిచేసరికి 59.74 మిలియన్ డాలర్లు.. అంటే 382.69 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చైనాలో ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్స్.. ఇండియాకు మించి కావడం మరో విశేషం. సెకండ్ వీకెండ్ లో ఈ వసూళ్లను చూస్తే.. శుక్రవారం 6.21 మిలియన్లు.. శనివారి 13.86 మిలియన్లు.. ఆదివారం 12.53 మిలియన్ డాలర్లను రాబట్టింది.

రెండో వీకెండ్ లో వచ్చిన మొత్తం.. తొలి వీక్ డేస్ లో వచ్చిన వసూళ్ల కంటే అధికం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 1500 కోట్ల రూపాయల వసూళ్లకు ఇప్పుడు బాహుబలి2 తో పాటు.. దంగల్ కూడా శరవేగంగా పరుగులు పెడుతోంది.

,  ,  ,  ,