Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2016 10:54:55
facebook Twitter Googleplus
Photo

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ?బాహుబలి? సినిమా గతేడాది జూలైలో విడుదలై దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఈ సినిమా, ఇతర దేశాల్లోనూ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తాజాగా బాహుబలికి అతిపెద్ద మార్కెట్‌గా అవతరించే అవకాశంగా కనిపిస్తోన్న చైనాలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
చైనాలో బాహుబలి పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న ఈస్టార్స్ సంస్థ జూన్‌లోనే సినిమాను విడుదల చేయాలని భావించినా కొన్ని అనుకోని కారణాల వల్ల జూలైకి వాయిదా వేశారు. ఇక తాజాగా జూలై 22వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు బాహుబలి టీమ్, ఈ స్టార్స్ సంస్థ ప్రకటించేశాయి. చైనా రిలీజ్ కోసం రాజమౌళి సహా టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా, జూలై రెండో వారంలో, ప్రభాస్, రాజమౌళి తదితరులు స్వయంగా చైనా వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు రెండో భాగమైన ?బాహుబలి ది కంక్లూజన్? రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

,  ,  ,  ,  ,  ,  ,