Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 12:00:38
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో పైసా వసూల్ మూవీని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. దసరా పండుగ నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయనుండగా.. తన తర్వాతి మూవీని కూడా ప్రారంభించేస్తున్నారు బాలయ్య. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలకృష్ణ 102వ చిత్రాన్ని.. ఈ నెల 10న గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రారంభించనున్నారు.

స్టోరీ ప్రకారం.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కావడంతో.. బాలయ్య కేరక్టర్ కు అనుగుణంగా ఈ మూవీకి టైటిల్ గా రెడ్డి గారు అనే పేరు ప్రచారంలో జరిగింది. దాదాపుగా ఇదే ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో.. బాలయ్య నుంచి ఈ పేరుకు అభ్యంతరాలు వచ్చాయట. ప్రస్తుతం తను ఎమ్మెల్యే కావడం.. రాజకీయంగా ప్రత్యర్ధి సామాజిక వర్గానికి చెందిన పేరు కావడంతో.. ఈ టైటిల్ పై ఆయనకు పలువురు సూచనలు చేశారట. అందుకే ఈ మూవీ టైటిల్ పేరును మార్చాలని సూచించగా.. ఇప్పుడీ చిత్రానికి జయ సింహ అనే టైటిల్ నిర్ణయించారని తెలుస్తోంది. నిజానికి సమర సింహా రెడ్డి.. చెన్నకేశవ రెడ్డి వంటి టైటిల్స్ పై సినిమాలు చేసినా.. అప్పుడాయన ఎమ్మెల్యే కాదు. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేకపోవడంతోనే.. టైటిల్ మార్చాల్సి వచ్చిందట.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జయసింహను 2018 సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తామని నిర్మాత సి కళ్యాణ్ ఇప్పటికే చెప్పేశారు. వేగంగా సినిమాలు చేయడంలో బాలయ్యకు ఎంత పేరుందో.. దర్శకుడు కేఎస్ రవికుమార్ కు కూడా అంతే గుర్తింపు ఉంది.

,  ,  ,  ,  ,