నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. తెలుగు వారి ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచానికి చాటి చెప్పిన క్రీ.శ. 2-3 శతాబ్దాలకు చెందిన మహరాజు గౌతమిపుత్ర శాతకర్ణి కథను.. అద్భుత గాధగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇటువంటి పాత్రలకు బాలయ్య తప్ప మరెవరూ సరితూగలేరనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే.
అయితే.. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్స్ తో పాటు.. షూటింగ్ స్పాట్ పిక్స్ కూడా తరచుగా లీక్ అవుతున్నాయి. సినిమాలోని ప్రధాన తారాగణానికి చెందిన ప్రతీ ఒక్కరి లుక్స్ ఇప్పటికే బైటకు వచ్చేశాయి. నిజానికి దసరా పండుగ సందర్భంగా.. విజయదశమి పండుగకు మూడు రోజుల ముందు గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ ను లాంఛ్ చేయాలని భావిస్తున్నారు బాలయ్య. అయితే.. ఈలోగానే కీలక నటులకు సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో తిరుగుతుండడం.. ఇందుకు బాధ్యులు ఎవరో తెలియకపోవడం.. బాలయ్యకు కోపం తెప్పించిందని తెలుస్తోంది.
అందుకే షూటింగ్ స్పాట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డర్ చేశారట బాలయ్య. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ జరుగుతుండగా.. మరికొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి.. హైద్రాబాద్ లో మిగిలిన భాగం షూట్ చేయనున్నాడు దర్శకుడు క్రిష్.