Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 14:03:16
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు తన సెంచరీ మూవీని స్టార్ట్ చేసేయబోతున్నారు. ఇప్పటికే 99 సినిమాలు చేసిన బాలయ్య.. తన వందో చిత్రంగా శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నారు. ఏప్రిల్ 8న ఉగాది రోజున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన బాలకృష్ణ.. ఇప్పుడు సినిమా ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు.

ఏప్రిల్ 22న బాలయ్య సెంచరీ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. సినిమా ముహూర్తం పూజ షూటింగ్ ప్రారంభం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజున తనతో 99 సినిమాలను తీసిన గత చిత్రాల దర్శకులు అందరినీ పిలవనున్నారట బాలకృష్ణ. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా వందో సినిమా ప్రారంభం కానుంది.

దిగ్గజ - సీనియర్ దర్శకులే ముఖ్య అతిథులుగా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ప్రారంభం కానుంది. అక్కడినుంచి నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట. ఈ మూవీ కోసం స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ తో పాటు మొరాకో - ఆస్ట్రియా సహా పలు యూరోప్ దేశాల్లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

,  ,  ,  ,  ,  ,  ,