Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 11:00:28
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. అలా అయితేనే నందమూరి ఫ్యాన్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోతారు. అందుకే సింహా - లయన్ - డిక్టేటర్ లాంటి ఎన్నో వెయిట్ వున్న టైటిల్స్ అన్నీ బాలయ్య కోసమే అన్నట్టు వున్నాయి. తాజాగా ?సార్వభౌమ? అనే టైటిల్ రిజిస్ట్రేషన్ బాలయ్య కోసమే అన్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ?లయన్? దర్శకుడు సత్యదేవా ఈ టైటిల్ తో ఓ మాంచి మాస్ స్క్రిప్టును బాలయ్యకోసం రెడీ చేశాడంట. ఇప్పటికే స్టోరీని కూడా బాలయ్యకు వినిపించేశాడని టాక్ వినబడుతోంది.

గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ల్యాండ్ మార్క్ తరువాత.. బాలయ్య తదుపరి చిత్రమేమిటనేది ఇంకా తెలియడం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీతో ?రైతు? చేస్తాడని ప్రచారం వున్నా... అందులో అమితాబ్ పోషించే కీలక పాత్రకోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దాంతో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

సో... బాలయ్య తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో సత్యదేవా రాసుకున్న ?సార్వభౌమ? స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే టాక్ వుంది. లయన్ సినిమా కొంత నిరాశ పరిచినా... ఈ సినిమా స్క్రిప్టు మాత్రం బాలయ్య అభిమానులను అన్ని విధాల మెప్పించేలా వుందని అంటున్నారు. చూడాలి మరి.. బాలయ్యను సత్యదేవా ?సార్వభౌమ? అంటాడో లేదో!

,  ,  ,  ,