Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 13:18:31
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు అంటూ మెగా బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి శ్రీను.. తొలిసారిగా ఇండస్ట్రీ రికార్డు జాబితాలో చేరాడు. బోయపాటి తర్వాతి ప్రాజెక్టుపై సరైనోడు రిలీజ్ సమయానికే క్లారిటీ ఉంది. బెల్లకొండ శ్రీనివాస్ తో తన నెక్ట్స్ మూవీ చేస్తున్నట్లు చెప్పిన బోయపాటి.. సినిమా ప్రారంభించడానికి మాత్రం బాగానే టైమ్ తీసుకున్నాడు.

స్క్రిప్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకపోవడం బోయపాటికి స్ట్రెంగ్త్ కం వీక్ నెస్ కూడా. అందుకే ఏప్రిల్ లో సరైనోడు విడుదలైతే.. ఇప్పటికి కానీ బెల్లంకొండ ప్రాజెక్టుపై క్లారిటీ రాలేదు. నవంబర్ 4 నుంచి ఈ మూవీని స్టార్ట్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఇప్పటికే ఖాయం చేసిన సంగతి తెలిసిందే. బోయపాటి స్టైల్ లోనే ఇది పక్కా యాక్షన్ ఎంటర్టెయినర్ గానే తెరకెక్కనున్నా.. తగినన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. దీపావళి పండుగ తర్వాత నుంచి మొదలుపెట్టి.. సుదీర్ఘమైన షెడ్యూల్స్ ప్లాన్ చేశారట.

పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి.. సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ యాక్టర్ శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషించనుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సరైనోడు నుంచి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీతో అనుబంధం పెరగడంతో.. ఈ మూవీకి కూడా కంటిన్యూ చేస్తున్నాడు బోయపాటి. నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైంది.

,  ,  ,  ,  ,