Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 10:21:29
facebook Twitter Googleplus
Photo

సినిమాలు ఒకేలా ఉండవు.. అనే మాట ఇప్పుడు మన ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఎందుకంటే సినిమాలో కొంచెం.. ఏ సినిమా తాలూకు సీన్ తాకినా అదే తిప్పేసాడ్రా.. అనేస్తున్నారు. దీంతో దర్శకులు హీరోలు కొత్త ప్రపంచంలోని కొత్త కథలను ఎంచుకుంటున్నారు. అయితే బెల్లంకొండ హీరో శ్రీనివాస్ మాత్రం ఏకంగా ప్రపంచాన్నే కథగా చేసుకున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో పంచ బుతాల కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం సాక్ష్యం.

మొన్నటి వరకు యాక్షన్ అంటూ..కనిపించిన ఈ హీరో తన నాలుగవ సినిమాతో సరికొత్తగా రాబోతున్నాడు. అయితే ప్రస్తుతం సాక్ష్యం యాక్షన్ సీన్స్ తో చాలా బిజీగా వుంది. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో హోస్పెట్ లో భారీ యాక్షన్స్ సీన్స్ తెరకెక్కుతున్నాయి. మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో దాదాపు 15 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు. హీరోయిన్ పూజా హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గొంది.

సినిమాలో ఈ సీన్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. అంతే కాకుండా శ్రీవాస్ మార్క్ కామెడీ ఎమోషన్ తో పాటు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాని మరో స్థాయికి తీసుకెళతాయని చిత్ర యూనిట్ తెలిపింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా శ్రీనివాస్ కెరీర్ లో మరో పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.

,  ,  ,  ,  ,