Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 15:56:05
facebook Twitter Googleplus
Photo

బిచ్చగాడు అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగులో హీరోగా స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా ?సైతాన్? అనే సినిమాతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తమిళంలో భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులో ?బేతాళుడు? పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్‌తో ఇక్కడ కూడా విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా అన్నీ కుదిరితే ఈ గురువారం (నవంబర్ 17న) విడుదల కావాల్సింది. అయితే భారత ప్రభుత్వం 500,1000 నోట్లను రద్దు చేయడం, మార్కెట్‌లో డబ్బు ఇబ్బందిగా మారిపోవడం, ఈ ప్రభావం సినిమాలపై కూడా పడడంతో ?బేతాళుడు?ను వాయిదా వేశారు.
విజయ్ ఆంటోనీ వారం క్రితం స్వయంగా ప్రకటించిన విడుదల తేదీని ఇప్పుడిక వేరే మార్గం లేక వాయిదా వేయాల్సి వచ్చింది. ఒక ఆసక్తికర హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాను విజయ్ తన సొంత బ్యానర్‌పై నిర్మించారు. ఇక కొత్త విడుదల తేదీ ఏదన్నది టీమ్ మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది. ప్రదీప్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

,  ,  ,  ,  ,