Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2015 10:22:03
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన ఫ్యామిలీ వివరాలను ... విశేషాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన పవన్ - రేణు దేశాయ్ కొడుకు పేరు అకీరా నందన్ అనే విషయాన్ని పెద్దగా పరిచయం చేయవలసిన పనిలేదు. కొన్ని కారణాల వలన రేణు దేశాయ్ .. పవన్ కి దూరంగా ఉంటున్నా, ఆ ఫ్యామిలీ పట్ల పవన్ ప్రేమానురాగాలను ప్రకటిస్తూనే ఉంటాడు. అకీరా స్కూలుకి వెళ్లి వస్తుంటాడు ... స్నేహితులతో కలిసి ఆడుకుంటూ వుంటాడు. అందువలన అతని భద్రతకిగాను నలుగురు బాడీ గార్డులను నియమించినట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కొడుకుగా అకీరా అందరికి తెలుసు. ఇటీవల కాలంలో రాజకీయాల్లోనూ పవన్ తనదైన దూకుడుని చూపిస్తూ వస్తున్నాడు. దాంతో అకీరా భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు పవన్ .. త్రివిక్రమ్ తో ఎక్కువ చనువుగా ఉన్నట్టే, అకీరా కూడా త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటాడట. సక్సెస్ తో పాటు మాత్రమే కొనసాగే సినిమా స్నేహానికి అతీతంగా, పవన్ .. త్రివిక్రం స్నేహాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం నిజంగా అభినందించదగిన విషయం.

,  ,  ,  ,