Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2015 11:51:13
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన 'గబ్బర్ సింగ్' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ రానుందనే వార్తలు అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. 'గబ్బర్ సింగ్ 2'గా టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ సినిమా, కొంతకాలం క్రితం లాంఛనంగా ఆరంభమైంది. అయితే అనుకోని కారణాల వలన ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్, ఈ నెల 29 నుంచి రెగ్యులర్ గా జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా జాప్యానికి కారణాలుగా అనేక ఊహాగానాలు షికారు చేశాయి.

కథాపరమైన విషయంలో పవన్ మార్పులు .. చేర్పులు సూచించడం వలన ఆలస్యమవుతోందనీ, రాజకీయాలకి అధిక ప్రాధాన్యతను ఇవ్వడమేనని ఇలా అనేక ప్రచారాలు జరిగాయి. అసలు ఈ సినిమా ఉంటుందా .. ఉండదా? అనే సందిగ్ధం అభిమానులను బాగా నిరుత్సాహ పరిచింది. ఏదేవైనా మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుందనే వార్త, వాళ్లకి ఉత్సాహాన్ని .. ఉత్తేజాన్ని ఇచ్చేదేనని చెప్పొచ్చు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా అనీషా ఆంబ్రోస్ ఎంపిక కాగా, మరో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది.

,  ,  ,  ,  ,  ,  ,