Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 11:58:37
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మోత్సవం.. ప్రస్తుతం తెలుగులో ఈ సమ్మర్ సీజన్‌కు రానున్న సినిమాల్లో భారీ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటి. మంచి అంచనాలతో రాబోతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ నేటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో మొదలవుతున్నది. ఐదు రోజులు పాటు జరగబోతున్న ఈ షెడ్యూల్ లో ఒక పాట తో పాటు మిగిలిఉన్న సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
మంచి కుటుంబకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆకట్టుకునే భావోద్వేగాలను కథలో మిళితం చేసినట్టు తెలిసింది. సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలలో మహేష్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ సినిమా ఆడియో వేడుకను మే 1 తిరుపతిలో భారీ ఎత్తున జరపనున్నారు. ఈ సినిమా మే నెలలో రెండో వారం లో విడుదల కావచ్చని సమాచారం. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,