Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 13:30:19
facebook Twitter Googleplus
Photo

పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ ఒకటి ఆశిస్తారు. వాళ్ల ఫ్యామిలీలో స్టాల్ వార్ట్ అనదగ్గవాళ్లు ఆ హీరో సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కోరుకుంటారు. నాగచైతన్య విషయానికి వస్తే అతడి ఫ్యామిలీలో చాలామంది స్టాల్ వార్ట్స్ ఉన్నారు. ఇటు నాన్నవైపు అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్.. నాగార్జున.. అటు అమ్మ వైపు దగ్గుబాటి ఫ్యామిలీలో రామానాయుడు.. వెంకటేష్. ఐతే ?మనం? సినిమాలో ఒకేసారి నాన్నతో.. తాతతో నటించేసి ముచ్చట తీర్చుకున్నాడు చైతూ. ఏఎన్నార్ చనిపోయే ముందు చేసిన చివరి సినిమా ఇదే. ఒకరకంగా ఆయనతో నటించినందుకు చైతూ అదృష్టవంతుడే.

ఐతే రామానాయుడితో నటించే ఛాన్స్ మాత్రం చైతూకు దక్కలేదు. గత ఏడాది ఆయన వెళ్లిపోయారు. మావయ్య వెంకటేష్-చైతూ కాంబినేషన్లో సినిమా గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చైతూ కొత్త సినిమా ?ప్రేమమ్?లో వెంకీ క్యామియో రోల్ చేస్తాడని ఇంతకుముదే రూమర్లు వినిపించాయి. ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ లేకపోవడంతో ఇది జస్ట్ రూమరే అనుకున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో వెంకీ క్యామియో రోల్ చేస్తున్న సంగతి వాస్తవమే అంటున్నారు. మలయాళంలో కొన్ని నిమిషాలే ఉండే హీరో తండ్రి పాత్ర భలే తమాషాగా అనిపిస్తుంది. తెలుగులో ఆ పాత్రను మావయ్యగా మార్చారట. ఆ క్యారెక్టర్ని వెంకీనే చేశాడట. తెలుగులో మరింత ఫన్నీగా పాత్రను తీర్చిదిద్దాడట టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి. మరి మామా అల్లుళ్ల కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,