Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 12:02:32
facebook Twitter Googleplus
Photo

కృష్ణవంశీ డైరెక్షన్ చేసిన యాక్షన్ ఎంటర్ టెయినర్ మూవీ నక్షత్రం తనకు తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ లా మిగిలిపోతుందని యంగ్ హీరో సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నక్షత్రం అతడి ఆశలన్నీ నిరాశే చేసింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పెషల్ రోల్ చేసినా అదీ ఆ సినిమా ఫ్లాప్ కాకుండా కాపడలేకపోయింది. ఇలాంటి టైంలో సందీప్ నటించిన తాజా చిత్రం కేరాఫ్ సూర్య అతడి ఆశలకు జీవం పోసేలానే కనిపిస్తోంది.

డబ్బింగ్ అయినా కూడా కార్తీకి తెలుగులో మంచి హిట్ గా నిలిచిన నాపేరు శివ సినిమా డైరెక్టర్ సుశీంద్రన్ డైరెక్షన్ లో కేరాఫ్ సూర్య తెరకెక్కింది. ఈమధ్య సందీప్ తమిళ సినిమాల్లో కూడా బాగానే కనిపిస్తుండటంతో ఈ మూవీని రెండు భాషల్లో తెరకెక్కించారు. నవంబర్ 10న థియేటర్లకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మధ్య తరగతి కుటుంబంలోని ఓ వ్యక్తి స్నేహం కోసం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనే పాయింట్ తో సినిమా రూపొందింది. ఫ్రెండును కూడా నమ్మవా అంటూ స్టార్టింగ్ డైలాగ్ తో మొదలెట్టి.. వాడు నా ఫ్రెండు. వాడిని కొట్టాలన్నా.. చంపాలన్నా హక్కు నాది మాత్రమే అంటూ ఫినిషింగ్ డైలాగ్ వరకు ఫ్రెండ్ షిప్ మెయిన్ కాన్సెప్ట్ గానే సినిమా తెరకెక్కింది.

మహానుభావుడు - రాజా దిగ్రేట్ సినిమాలతో రెండు హిట్లు ఖాతాలో వేసుకున్న మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. తొలుత ఫన్నీగా స్టార్టయిన కథ చివరకు యమ సీరియస్ గా మారబోతుందనే విషయం ట్రైలర్ లో క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి స్టోరీపై ప్రేక్షకులకు కొత్తగా అంచనాలేమీ ఉండవు. కాకపోతే స్టోరీ ఎమోషనల్ టర్న్ తీసుకున్నాక వచ్చే మలుపులు ఆసక్తికరంగా ఉంటాయన్నదే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశమవుతుంది.

,  ,  ,  ,  ,