Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:29:03
facebook Twitter Googleplus
Photo

జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహా నటుడు నందమూరి తారకరామారావు. ఆయన చేసిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత హీరోలు సినిమాల్లో రెండు పాత్రలకే పరిమితమావుతున్నారు. కానీ ఆ కాలంలో ఆయన ఒకే సినిమాలో నాలుగైదు పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మళ్లీ ఆయానంత కాకపోయినా ఆయన పేరు పెట్టికున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో జై లవకుశ సినిమాతో రాబోతున్నాడు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కేవలం థియేటర్స్ లో సందడి చేయడమే తరువాయి. రిలీజ్ కు ఇంకా టైం ఉండడం తో చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని బయటపెడుతూ.. సినిమాపై అంచనాలని పెంచుతోంది. రీసెంట్ గా సాంగ్ ట్రైలర్స్ ని రిలీజ్ చేసి ఎన్టీఆర్ అభిమానులకు అన్ని సువాసనలను అందించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఇంకొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేసి కాస్త రుచిని చూపించే ప్రయత్నం చేస్తోంది.. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా కూల్ గా స్టయిలిష్ గా ఉన్నాడు. ఇక పక్కనే బబ్లీ గర్ల్ రాశి ఖన్నా చమక్కున మెరుస్తోంది. ఇద్దరు వైట్ డ్రెస్ లో చాలా కొత్తగా ఉన్నారు. ముఖ్యంగా రాశి ఈ సినిమా కోసం కాస్త డైటింగ్ చేసి సన్నబడినట్లే కనిపిస్తోంది. ఇక నటనలో డ్యాన్సులో కూడా అమ్మడు ఎన్టీఆర్ తో కష్టపడి చేసిందట.

ఇప్పటివరకు జై లవకుశ జనాల్లో పాజిటివ్ టాక్ తోనే ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు అయితే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా.. ట్రైలర్ కూడా భారీ అంచనాలు రేపింది.

,  ,  ,  ,  ,