Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 10:59:29
facebook Twitter Googleplus
Photo

స్టార్స్ పై వచ్చే రూమర్స్ కి లెక్క పెట్టడం చాలా కష్టమైన విషయం. కనిపించినా కనిపించకపోయినా.. ఏమైనా చేసినా చేయకపోయినా రూమర్స్ పుట్టించేయగల సమర్ధులు చాలామంది ఉంటారు. ఇలాంటి రూమర్స్ అన్నిటికీ పీక్ స్టేజ్ ఏంటంటే.. ఆయా స్టార్లు చనిపోయారని చెప్పడమే.

రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ చనిపోయాడంటూ షారూక్ ఖాన్ చనిపోయాడంటూ ఓ రూమర్ స్ప్రెడ్ అయింది. అయితే.. ఇది మొదలైంది ఇక్కడ కాదు లెండి.. ఎల్ పయాస్ అనే యూరోపియన్ టీవీ ఛానల్ లో.. షారూక్ ఖాన్ మరణించాడంటూ బ్రేకింగ్ న్యూస్ కూడా వేసేశారు. ఓ ప్రైవేటు జెట్ క్రాష్ అవడంతో.. మరో ఏడుగురితో పాటు ఇండియన్ సూపర్ స్టార్ షారూక్ మరణించాడన్నది వీటి సారాంశం. అయితే.. షారూక్ ఇలాంటి వాటిని పట్టించుకునే రకం కాదు. కానీ ప్రతీ విషయాన్ని తనదైన స్టైల్ లో కామెడీ చేసి పారేయగల సత్తా కింగ్ ఖాన్ సొంతం.

ఇంతియాజ్ డైరెక్షన్ లో ది రింగ్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీస్ లో నటిస్తున్నాడు షారూక్ ఖాన్. రీసెంట్ గా ఆనంద్ ఎల్ రాయ్ మూవీ షూటింగ్ లో ఓ యాక్సిడెంట్ అయిందట. దీన్నుంచి తప్పించుకున్నాడు కానీ.. దీన్ని తన చావుపై వచ్చిన బ్రేకింగ్ న్యూస్ లింక్ పెట్టి.. ఉఫ్ అంటూ ఓ ఫోటో షేర్ చేసాడు షారూక్. విమాన ప్రమాదం నుంచి కాదు.. కానీ సెట్స్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ ను తప్పించుకున్నా.

,  ,  ,  ,  ,