Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 15:40:42
facebook Twitter Googleplus
Photo

కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువున్నా సందీప్ కిషన్ కు అవకాశాలకేమీ కొదవలేదు. అతడి ప్రతి సినిమాకు అతడి స్థాయికి మించే క్రేజ్ వస్తోంది. ఐతే సరైన టైమింగ్ లో తన సినిమాలు రిలీజ్ చేసుకోలేక దెబ్బ తింటున్నాడు సందీప్. ?రన్? సినిమా అతడికి మామూలు పంచ్ ఇవ్వలేదు. రెండు రోజుల్లో ?ఊపిరి? రాబోతుండగా తన సినిమాను రిలీజ్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ?రన్? అంత చెత్త సినిమా కాకపోయినా.. కొంచెం డివైడ్ టాక్ రావడం.. అప్పుడే ?ఊపిరి? చాలా మంచి టాక్ తెచ్చుకోవడంతో సందీప్ మూవీ అడ్రస్ లేకుండా పోయింది. ?రన్? దెబ్బ నుంచి కోలుకునే వెంటనే కొంచెం విరామంలో ?ఒక్క అమ్మాయి తప్ప? మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్.

ఐతే సోలోగా మంచి టైమింగ్ లో తన సినిమాను రిలీజ్ చేసుకునే అవకాశమున్నా అతను వదులుకున్నాడు. నిజానికి ?ఒక్క అమ్మాయి తప్ప? ఈ శుక్రవారమే విడుదల కావాల్సింది. కానీ అనుకోకుండా జూన్ 10కి వాయిదా వేసేశారు. ?బ్రహ్మోత్సవం?కు డిజాస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ శుక్రవారం ?ఒక్క అమ్మాయి తప్ప?ను రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం ఉండేది. ఇంకే తెలుగు సినిమా కూడా ఈ వారం విడుదల కావట్లేదు. ప్రేక్షకులు వేరే ఆప్షన్ లేకపోవడం వల్లే ఇంకా సుప్రీమ్.. 24.. సరైనోడు సినిమాలే చూస్తున్నారు కానీ.. మంచి సినిమా పడితే దానివైపు మొగ్గు చూపడం ఖాయం. ఐతే ఏ పోటీ లేని డేటు వదిలేసి.. జూన్ 10న ఒక్క మనసు.. రైట్ రైట్.. సినిమాలతో పోటీకి దిగుతున్నాడు సందీప్. అవి కూడా చిన్న సినిమాలే అయినా.. పోటీ వల్ల ఎంతో కొంత నష్టం జరగకుండా ఉండదు కదా. పైగా ముందు వారం రిలీజైన ?అ..ఆ? హిట్ టాక్ తెచ్చుకుంటే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వెనుకే నాని సినిమా ?జెంటిల్మన్? కూడా వస్తుంది. మరి ఇన్ని సినిమాల మధ్య పోటీ కన్నా.. ఈ వారం రిలీజ్ చేసేస్తే పోయేది కదా.

,  ,  ,  ,  ,  ,