Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2015 11:06:28
facebook Twitter Googleplus
Photo

శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ ఎపిసోడ్స్ తో నాన్ స్టాప్ గా నవ్విస్తుంటాడు .. మధ్యలో యాక్షన్ ని ఎంటర్ చేస్తుంటాడు .. హుషారైన పాటలతో ఉత్సాహాన్ని తెప్పిస్తుంటాడు. తనదైన శైలిని అనుసరిస్తూనే ఆయన తన తాజా చిత్రంలో రాంచరణ్ ని మరింత కొత్తగా అభిమానుల ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూలు కోసం ఈ సినిమా యూనిట్ స్పెయిన్ చేరుకుంటుంది.

రేపటి నుంచి స్పెయిన్లో ఈ షెడ్యూలును మొదలుపెట్టనున్నారు. కథాపరంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను .. రెండు పాటలను స్పెయిన్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరించనున్నారు. చరణ్ జోడీగా రకుల్ కనువిందు చేయనున్న ఈ సినిమాకి 'బ్రూస్ లీ' అనే టైటిల్ ను పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విభిన్నమైన కథా కథనాలతో వినోదభరితంగా రూపొందుతోన్న ఈ సినిమా ఇటు శ్రీను వైట్లకీ .. అటు చరణ్ కి విజయాన్ని అందించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,