Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 13:03:03
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకూ టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ స్క్రీన్ చూడని ఓ బోల్డ్ క్యారెక్టర్ ను సృష్టించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో పాత్రను సృష్టించడమే కాదు.. దాన్ని డీల్ చేసిన విధానం కూడా జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు సందీప్ వంగా మరుసటి ప్రాజెక్ట్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సెన్సేషనల్ డైరెక్టర్.. తన కొత్త సినిమా ఎవరితో చేస్తాడు.. ఈసారి ఎలాంటి పాత్రను హీరో కోసం సృష్టించబోతున్నాడనే ఆసక్తి కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఈ విషయంలో సందీప్ వంగా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడని తెలుస్తోంది. టాప్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ తో ఈ దర్శకుడు తన కొత్త సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈమేరకు ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్లాట్ పై హీరో డైరెక్టర్ ఇద్దరికీ సంతృప్తి లభించడంతో.. ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడట దర్శకుడు సందీప్ వంగా.

అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ కు చాలానే అవకాశాలు వచ్చినా.. తన స్టైల్ లో మూవీ మేకింగ్ కు సై అనే వారికే మొగ్గు చూపాలన్నది ఈ దర్శకుడి ఆలోచన. అందుకు తగినట్లుగానే టీం సెట్ అయినట్లు చెబుతున్నారు. ఆది హీరోగా చుట్టాలబ్బాయి మూవీ నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి.. సందీప్ వంగా-శర్వానంద్ ల చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.

,  ,  ,  ,  ,