Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2017 13:39:03
facebook Twitter Googleplus
Photo

అవసరమైతే సిక్స్ ప్యాక్ కూడా చేస్తా అంటూ మొన్న సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. 61 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ ఏంటి.. చిరు ఏదో మాట వరసకు అని ఉంటాడులే అని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ చిరు అన్నది మాట వరసకు కాదని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తర్వాతి సినిమాను కన్ఫమ్ చేసిన చిరు.. ఇంకా స్క్రిప్టు రెడీ కాకుండానే ఆ సినిమా కోసం సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు. ఆయన ఇప్పటికే జిమ్ లో గంటలు గంటలు గడుపుతూ ఈ సినిమా కోసం లుక్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

?ఖైదీ నెంబర్ 150?లో చిరు లుక్ విషయంలో ఎన్నెన్ని ప్రశంసలు వచ్చాయో తెలిసిందే. ఆ ప్రశంసలు చిరులో మరింత ఉత్సాహం తీసుకొచ్చినట్లున్నాయి. వినాయక్ అన్నట్లు తర్వాతి సినిమాలో చిరు మరింత ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. సురేందర్ సినిమాలంటేనే స్టైలిష్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చిరు కోసం కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు తగ్గట్లుగా చిరు తన లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ కాకపోయినా.. దానికి దగ్గరగా కండలు తిరిగిన శరీరంతో చిరు కనిపించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ వయసులో చిరు చూపిస్తున్న కమిట్మెంట్ చూసి యువ కథానాయకులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

,  ,  ,  ,  ,  ,