Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 10:38:40
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు సూపర్ హిట్ కమెడియన్ ఎదిగిన వారిలో సుధాకర్ ఒకరు. ముఖ్యంగా 1980 లలో ఒక తరహాలో విలనీ కామెడీని పండించి ఆ తర్వాత 1990 నుంచి తన కామెడీని మార్చి కొత్తగా నవ్వించాడు. అప్పట్లో హీరోలకంటే బిజీగా ఉండేవాడు ఈ నటుడు. ఇక మెగాస్టార్ చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో ఉండే స్నేహితుల్లో అందరికంటే క్లోజ్ సుధాకర్ అని చెప్పాలి. చిరుతో యముడికి మొగుడు అనే సినిమాకు సుధాకర్ సహా నిర్మాతగా వ్యవహరించారు.

అయితే గత కొంత కాలంగా అయన సినిమాలను చేయడం లేదన్న విషయం అందరికి తెలిసిందే. చివరగా 2005లో వెంకటేష్ - సంక్రాంతి సినిమాలో కనిపించిన సుధాకర్ మళ్లీ కనిపించలేదు. ఎందుకంటే ఆయన కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. అప్పట్లో చిరు హాస్పిటల్ కి వెళ్లి మరి సుధాకర్ ని పలరించారు. అయితే ప్రస్తుతం ఈ 57 ఏళ్ల నటుడు ఫిట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ కెమెరా ముందు తన నటనను చూపెట్టబోతున్నాడు.

కొత్తగా తెరకెక్కుతోన్న ఇఈ అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ సినిమా ట్రైలర్ కూడా లంచ్ అయ్యింది. సుధాకర్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,