Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 15:41:15
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఎందరో వీరాభిమానులున్నారు. అందులో షకలక శంకర్ ఒకడు. పవన్ మీద తన భక్తిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటాడు శంకర్. పవన్ కు తన స్వస్థలమైన శ్రీకాకుళంలో గుడి కట్టించే ప్రయత్నంలో కూడా ఉన్నాడు పవన్. ఇలాంటి శంకర్ ను ?సర్దార్ గబ్బర్ సింగ్? షూటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొట్టినట్లుగా వార్తలొచ్చాయి. డైరెక్టర్ బాబీ మీద సెటైర్లు వేయడంతో కోపమొచ్చో.. ఇంకేదో కారణంతోనో పవన్ శంకర్ ను కొట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అప్పట్లోనే ఒకసారి క్లారిటీ ఇచ్చిన శంకర్.. తాజాగా ఇంకోసారి స్పందించాడు.

శ్రీ వేంకటేశ్వరుడు అన్నమయ్యను కొడతాడా.. శ్రీరాముడు భక్త రామదాసును కొడతాడా.. మరి పవన్ కళ్యాణ్ తన భక్తుడైన నన్నెందుకు కొడతాడు చెప్పండి అని ప్రశ్నించాడు షకలక శంకర్. పవన్ తనకు దేవుడి లాంటి వాడని.. తాను ఆయన భక్తుడినని శంకర్ అన్నాడు. వంద వ్యాపకాలున్న పవన్ కు తన లాంటి అభిమానులు కోట్లల్లో ఉంటారని.. ఆయనకు తమను కోప్పడే హక్కు.. అధికారం ఎప్పుడూ ఉంటాయని షకలక శంకర్ అన్నాడు. ఈ మాట అనడం ద్వారా పవన్ అప్పుడు తనను కొట్టలేదని.. కానీ తిట్టాడని శంకర్ ఒప్పుకున్నట్లయింది. పవన్ చీమకు కూడా హాని తలపెట్టడని.. ఆయన గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్నప్తి చేశాడు శంకర్. పవన్ మీద తనకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదని.. ఇప్పటికీ ఎప్పటికీ తాను పవన్ భక్తుడినేనని శంకర్ స్పష్టం చేశాడు. ?సర్దార్ గబ్బర్ సింగ్? షూటింగ్ సందర్భంగా ఎందుకురా నేనంటే నీకంత ఇష్టం అంటూ తన భుజం మీద చెయ్యి వేసి పవన్ అడిగాడని శంకర్ తెలిపాడు.

,  ,  ,  ,