Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2017 14:26:39
facebook Twitter Googleplus
Photo

దంగల్ సినిమా చైనాలో రిలీజవుతోందనగానే.. ఇది కూడా పీకే తరహాలో వంద కోట్లు కొల్లగొట్టేస్తుందా అన్న అంచనాలు మొదలయ్యాయి. కానీ ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా వందల కోట్ల వసూళ్లతో దూసుకెళ్లింది. రెండు వారాలు తిరిగేసరికే 600-700 కోట్ల మధ్య వసూళ్లు సాధించి అందరినీ విస్మయానికి గురి చేసింది. రెండు వారాల తర్వాత కూడా ఆ సినిమా జోరు తగ్గలేదు. ప్రతి వీకెండ్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఓ దశలో ఈ సినిమా అనూహ్యంగా అక్కడ రూ.1000 కోట్ల మైలురాయిని కూడా అందుకుంటుందేమో అన్న అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలే నిజమయ్యాయి.

చైనాలో దంగల్ వసూళ్లు రూ.1000 కోట్ల మైలురాయిని అందుకుంటున్నాయి. బుధవారం నాటికి చైనాలో దంగల్ వసూళ్లు రూ.992 కోట్లను దాటాయి. గురువారం మార్నింగ్ షో.. మ్యాట్నీలు పూర్తయ్యే సరికే దంగల్ రూ.1000 కోట్ల మైలురాయిని దాటేస్తుందని భావిస్తన్నారు. ముందు అనుకున్న ఒప్పందం ప్రకారమైతే ఈ పాటికి చైనాలో దంగల్ థియేట్రికల్ రన్ ఈపాటికి పూర్తవ్వాల్సింది. ఐతే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి.. ఇంకో నెల రోజులు చైనాలో ఆడించేలా కొనసాగింపు ఇచ్చారు. జులై 4 వరకు ఈ సినిమా చైనా థియేటర్లలో కొనసాగనుంది. ఫుల్ రన్లో ఈ సినమా అక్కడ రూ.1200 కోట్ల దాకా కొల్లగొడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.1710 కోట్లకు చేరుకున్నాయి. బాహుబలి-2 దాని వెనకే ఉంది. ఆసియాలో మరి కొన్ని దేశాల్లో కూడా దంగల్ ను రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.2 వేల కోట్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,