Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2017 11:07:43
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హాలీవుడ్ లో కూడా ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో దీపిక నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్- రిటర్న్ ఆఫ్ ది క్సాండర్ కేజ్ రిలీజ్ అయింది.. భారీ వసూళ్లనే రాబట్టగలిగింది. ఆ మూవీనే ఇప్పుడు దీపికకు ఓ అవార్డుకు నామినేట్ అయేందుకు కారణమైంది.

టీన్ ఛాయిస్ అవార్డుల్లో యాక్షన్ ముూవీ నటి విభాగంలో దీపికా పదుకొనేకు నామినేషన్ దక్కింది. అయితే.. ఈ అవార్డు ఆమె గెలుచుకోగలదా అంటే అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే.. ఆమెకు ఉన్న కాంపిటీషన్ అలాంటిది మరి. ఇదే విభాగంలో మరో ఐదుగురు భామలు పోటీ పడుతుండగా.. అందరిలోకీ వండర్ ఉమన్ బ్యూటీ గాళ్ గాడట్ తో దీపికకు పోటీ ఎదురుకానుంది. వండర్ ఉమన్ తో గాడట్ బ్లాక్ బస్టర్ కొట్టేసి.. జనాలను మెప్పించేయడంతో.. ఆమెను అధిగమించి అవార్డు చేజిక్కించుకోవడం దీపికకు కష్టం కావచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ట్రిపుల్ ఎక్స్ చిత్రంలోనే నటించిన నీనా డొబ్రెవ్.. రూబీ రోజ్ లు కూడా చాయిస్ యాక్షన్ మూవీ యాక్ట్రెస్ అవార్డ్ కోసం పోటీలో నిలిచారు.

,  ,  ,  ,  ,