Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 11:42:40
facebook Twitter Googleplus
Photo

అంచనాలు ఆకాశాన్నంటాయి అంటుంటారు. అమీర్ ఖాన్ సినిమా ?దంగల్? మీద అంచనాలు ఆకాశాన్ని దాటి ఇంకా ఎక్కడికో వెళ్లిపోయాయి. అంతటి అంచనాలతో సినిమా చూసినపుడు.. ఏమాత్రం తగ్గినా పెదవి విరిచేస్తాం. కానీ అంతటి అంచనాల్ని కూడా దాటిపోయి.. అద్భుత: అనిపిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్ల నుంచి బయటికి పంపించడం అంటే మామూలు విషయం కాదు. ?దంగల్? ఆ అద్భుతమే చేసి చూపించింది. బహుశా ?ఈ సినిమా బాగా లేదు? అనే మాట ఏ ప్రేక్షకుడూ అనలేని పరిస్థితి కల్పించిన అరుదైన సినిమా ?దంగల్? అంటే అతిశయోక్తి లేదు.

?పీకే? లాంటి సినిమా తర్వాత మహవీర్ పొగట్ అనే రెజ్లర్ కథతో అమీర్ ఖాన్ సినిమా చేస్తున్నాడు అన్నపుడు చాలామంది పెదవి విరిచారు. ఎంతైనా స్పోర్ట్స్ బయోపిక్ అంటే ఒక పరిధి దాటి చేయలేరని.. తెలిసిన కథను ఎంత బాగా చెప్పినా.. ఓ స్థాయి దాటి ప్రేక్షకుల్ని ఆకట్టుకోదని.. ఏదైనా కొత్త కథను ఎంచుకుని సినిమా చేస్తే బాగుంటుందని అన్నారు. కానీ అమీర్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేశాడు. అమీర్ ఈ సినిమా చేస్తున్నాడనగానే మహవీర్ పొగట్ ఎవరంటూ నెట్లో వెతికేశారు జనాలు. దీంతో కథేంటన్నది ముందే ఓ అవగాహన వచ్చేసింది. దీనికి తోడు ట్రైలర్లో కథేంటన్నది విప్పి చెప్పేశారు. ఇక సినిమా చాలా బాగుందంటూ నెల కిందటే ప్రివ్యూలు చూసిన సెలబ్రెటీలు కొందరు ట్వీట్లు చేసేశారు. దీంతో ఓవైపు అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు కథేంటన్నది రివీల్ అయిపోయింది. ఇలాంటి స్థితిలో అంచనాల్ని అందుకోవడం.. అదే సమయంలో ప్రేక్షకులకు కొత్తగా ఏదో చూపించి మెప్పించడం అన్నది అంత సులువైన విషయం కాదు. కానీ ?దంగల్? ఈ విషయంలో నూటికి రెండొందల శాతం విజయవంతమైంది. గొప్ప సినిమా అనుకుని వెళ్లినవాడికి ఇంకా గొప్పగా అనిపిస్తూ.. అంచనాల్లేకుండా వెళ్లినవాడికి సరికొత్త అనుభూతిని పంచుతూ.. బలమైన ముద్ర వేసింది ?దంగల్?. వినడానికి మామూలుగా అనిపించే కథను.. ఎంతో హృద్యంగా.. ఎమోషనల్ గా కదిలించేలా.. ఆలోచింపజేసేలా.. ఉత్తేజం కలిగించేలా.. తెరకెక్కించి రెండున్నర గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేసిన సినిమా ఇది. ఇందులోని విశేషాల గురించి లోతుల్లోకి వెళ్తే తెరపై చూసేటపుడు అనుభూతిని మిస్సవుతారు కాబట్టి.. ఇక్కడ వాటి జోలికి వెళ్లట్లేదు. ఐతే క్లాస్.. మాస్.. అర్బన్.. రూరల్.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఏ తరహా ప్రేక్షకుడైనా సరే.. చూసి ఆస్వాదించి.. ఒక మంచి సినిమా చూశామన్న సంతృప్తితో బయటికి రాగలిగే సినిమా ఇది. అమ్మాయిలపై వివక్ష గురించి.. వారికి దక్కాల్సిన ప్రోత్సాహం గురించి.. అందరికీ అర్థమయ్యేలా.. ఆలోచింపజేసేలా.. వినోదంతో కలిపి.. ఇంత గొప్పగా చెప్పిన సినిమా ఇండియన్ స్క్రీన్ పై ఇంతకుముందెన్నడూ రాలేదంటే అతిశయోక్తి లేదు. ఓవైపు సందేశం.. మరోవైపు వినోదం రెండూ సమపాళ్లలో అందిస్తూ.. ప్రేక్షకుల హృదయాల్ని కదిలించి.. గొప్ప అనభూతితో థియేటర్ల నుంచి బయటికి రప్పించే సినిమా ?దంగల్?.

ది బెస్ట్.. సందేహమే లేదు

?దంగల్? సినిమా అనేక రకాలుగా ?ది బెస్ట్? అన్నది చాలామంది అభిప్రాయం. ఇండియన్ సినిమా కలెక్షన్ల రికార్డులన్నింటినీ ?దంగల్? దాటేస్తుందనే విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. ఇక కంటెంట్ పరంగా ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే వచ్చిన అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ విషయంలో ?ది బెస్ట్? అనలేకపోయినా.. ఇండియాలో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో మాత్రం ?దంగల్? ది బెస్ట్ అనడంలో చర్చకు తావు లేదు. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచిన అమీర్.. ఈ సినిమాతో తనకు సాటి వచ్చే స్టార్ హీరో ఇంకెవరూ లేరని మరోమారు రుజువు చేసుకున్నాడు. లగాన్.. తారే జమీన్ పర్.. పీకే లాంటి సినిమాల్లో అత్యద్భుతమైన నటన కనబరిచినప్పటికీ.. వాటన్నిటికంటే ?దంగల్?లో మహవీర్ పాత్రను పోషించాడన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇది సామాన్యంగా కనిపించే అసామాన్య పాత్ర. పీకే లాంటి విలక్షణ పాత్రను చేయడం ఒకెత్తయితే.. ?హీరోయిజం? లేని సామాన్యుడిగా కనిపించి.. ఎమోషన్లను పండించడం మరో ఎత్తు. అందులోనూ ఈ పాత్ర కోసం అమీర్ ట్రాన్స్ ఫామ్ అయిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నటన కోసం ప్రాణం పెట్టడం అనే మాటలు వింటుంటాం.. అమీర్ విషయంలో ప్రతిసారీ చూస్తున్నాం. అందుకే అమీర్ కోణంలో చూసినా ?దంగల్? ది బెస్ట్ మూవీ. అమీర్ ఒక్కడనే కాదు.. అతడి కూతుళ్లుగా నటించిన నలుగురు అమ్మాయిలు.. భార్యగా నటించిన సాక్షి తన్వర్.. మిగతా నటీనటులందరూ కూడా వారి వారి పాత్రల్లో జీవించారు. సాంకేతిక హంగులు కూడా అద్భుతంగా కుదిరాయి. సంగీతం.. ఛాయాగ్రహణం సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేస్తాయి. అందరికీ మించి ఇలాంటి కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించిన నితీశ్ తివారి అందరికంటే ఎక్కువ ప్రశంసలకు అర్హుడు.

ఇది మన అదృష్టం..

అమీర్ ఖాన్ ఇప్పుడు కేవలం బాలీవుడ్ స్టార్ కాదు. ఇండియన్ హీరో. ప్రాంతీయ భాషల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గత రెండు దశాబ్దాల్లో అద్భుతమైన సినిమాలతో ప్రాంతీయ భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. భాష అర్థం కాకున్నా సరే.. అమీర్ సినిమా చూడాల్సిందే అని వేరే భాషల ప్రేక్షకులూ కూడా ఫిక్సయిపోయిన పరిస్థితి. లగాన్.. రంగ్ దె బసంతి.. 3 ఇడియట్స్.. పీకే లాంటి సినిమాలు అలాగే అన్ని ప్రాంతాల ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో ?దంగల్? సినిమాను ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అమీర్. అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ?దంగల్? లాంటి గొప్ప సినిమాను మన భాషలోనూ చూసుకునే అదృష్టం దక్కింది. హిందీలో చూస్తే వచ్చే ఫీల్ వేరే అయినప్పటికీ.. భాష అర్థం కాక అక్కడక్కడా ఇబ్బంది తప్పదు. అందుకే డబ్బింగ్ వల్ల సహజత్వం దెబ్బ తిన్నా సరే.. ప్రతి డైలాగ్ అర్థం చేసుకుంటూ చూడటంలో ఉన్న ఆనందాన్ని మన ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ?దంగల్? చూసి అద్భుతమైన అనుభూతితో థియేటర్ల నుంచి బయటికి వస్తున్నారు.

కలెక్షన్ల సునామీ..

బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు వస్తే పాత రికార్డులు బద్దలవడం.. కొత్త రికార్డులు నమోదవడం కొత్తేమీ కాదు. అందులోనూ అమీర్ ఖాన్ సినిమా వస్తోందంటే రికార్డుల మోత మోగాల్సిందే. అది కేవలం లాంఛనమే. కానీ ?దంగల్? సినిమా విడుదలైన పరిస్థితులు వేరు. ప్రస్తుతం డీమానిటైజేషన్ దెబ్బ నుంచి జనాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ వంద నోట్లను పొదుపుగానే వాడుకోవాల్సిన పరిస్థితి. దైనందిన అవసరాలకు డబ్బులు సరిపోని దుస్థితి. ఇలాంటి స్థితిలోనూ ?దంగల్? అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. కాసుల కటకట ఉన్నా సరే.. సినీ ప్రియులెవ్వరూ కూడా ?దంగల్? లాంటి సినిమాను చూడటంలో ఎంతమాత్రం ఆలస్యం చేసే పరిస్థితి లేదు. అలాంటి గొప్ప సినిమా ఇది. అందుకే ఈ చిత్రం డీమానిటైజేషన్ ప్రభావాన్ని అధిగమించి అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ఇండియాలో రూ.30 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిన ?దంగల్?.. తర్వాతి రెండు రోజుల్లో ఇంకా ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. శనివారం వసూళ్లు రూ.35 కోట్ల దాకా ఉంటే.. ఆదివారం ఏకంగా రూ.42 కోట్లకు పైగా వసూలైంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ వచ్చినా.. రెండో రోజు కలెక్షన్లు కొంచెం తగ్గుతాయి. లేదా సమానంగా ఉంటాయి. అంతే తప్ప ఇంత గ్రోత్ ఉండదు. తొలి రోజు సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం.. పైగా అదనపు షోలు కూడా ఉండటం.. రెండో రోజుకు అలాంటిదేమీ లేకపోవడమే ఇందుకు కారణం. కానీ ?దంగల్? మాత్రం అంచనాల్ని మించి 2.. 3 రోజుల్లో వసూళ్లు సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లోనూ వంద కోట్ల వసూళ్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. మరోవైపు విదేశీ వసూళ్లు ఇప్పటికే 80 కోట్లు దాటినట్లుగా వార్తలొస్తున్నాయి. అమెరికా.. ఆస్ట్రేలియా.. బ్రిటన్.. ఇలా ప్రతి దేశంలోనూ ?దంగల్? ప్రభంజనం సాగుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో ఈ సినిమా అన్ని రికార్డులనూ బద్దలుకొట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అమీర్ సినిమా ?పీకే?నే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్. ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.730 కోట్ల దాకా వసూలు చేసింది. ?దంగల్? దాన్ని అధిగమిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

,  ,  ,  ,  ,