Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 12:47:58
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ హంగామా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ధృవ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయగా.. త్వరలో ఆడియో రిలీజ్ కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ మొదటి వారంలో మూవీని థియేటర్లలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. నెల రోజులు ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు.

ఇప్పుడు మెగాపవర్ స్టార్ మూవీలోంచి హై ఎనర్జీ బీట్ ఉన్న ఓ సాంగ్ కు ప్రోమో రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. 'నీతోనే డాన్సునై.. నీతోనే డ్యాన్సునై.. నీతోనే పారిపో రాదా..' అంటూ సాగే పాట హై ఎనర్జిటిక్ గా ఉంది. పదంటే పది సెకన్ల పాటు ఉండే ఈ ప్రోమోలో.. 6 స్టెప్స్ ను చూపించేశారంటే.. చరణ్ ఈ పాటలో డ్యాన్స్ ఏ రేంజ్ లో కుమ్మేశాడో అర్ధమవుతుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్యాన్స్ బాగానే చేసి.. చెర్రీకి సరైన జోడీగా కనిపించింది.

కేవలం 10 సెకన్ల పాటు సాగే ఈ ప్రోమోను.. ఇవాళ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన గీతా ఆర్ట్స్.. రేపటి నుంచి అంటే నవంబర్ 5 నుంచి టీవీల్లో కూడా టెలికాస్ట్ చేయనున్నారు. ఇక రేపు తెల్లారేసరికల్లా 'చూశా చూశా' అంటూ సాగేమరో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. మెగాభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ పాటను లాంఛ్ చేసినప్పటి నుంచి.. ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లిస్ట్ లో #dhruvasongteaser హ్యాష్ టాగ్ నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉండడం విశేషం.

,  ,  ,  ,  ,  ,