Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2016 11:39:19
facebook Twitter Googleplus
Photo

ఒక్కొక్కరికి ఒక్కొక సెంటిమెంట్ ఉంటుంది. ఫిలిం ఇండస్ర్టీలో ఇలాంటి సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. ఇకపోతే హిట్టు కొట్టడానికి బోలెడెన్ని సెంటిమెంట్లు ఉంటే.. ఫ్లాపును దరిదాపులకు రాకుండా ఉంచడానికి కూడా చాలా సెంటిమెంట్లే ఉంటాయి. పైగా ఇలాంటి సెంటిమెంట్లు కొత్తకొత్తగా పుడుతుంటాయి. అలా దిల్ రాజు క్యాంపులో కూడా ఒకటి పుట్టిందట.

ప్రస్తుతం తన తదుపరి సినిమాల గురించి చాలా కసరత్తులు చేస్తున్న దిల్ రాజు గారు.. ఒక్కటి మాత్రం క్లియర్ చేశారట. మన సినిమాల్లో రాముళ్ళు.. కృష్ణుళ్లు.. అసలొద్దుబాబోయ్ అని చెప్పేశారట. కారణం ఏంటంటే?? ఇప్పటివరకు దిల్ రాజు బ్యానర్లు బీభత్సమైన అట్టర్ ఫ్లాపు సినిమాలేవైనా ఉన్నాయా అంటే.. అవి రామ రామ కృష్ణ కృష్ణ.. రామయ్యా వస్తావయ్యా.. కృష్ణాష్టమి.. మాత్రమే. ఈ మూడు సినిమాల్లోనూ రాముడు అండ్ కృష్ణుడు ఉన్నారు. అందుకే ఈ పేర్లను ఇక వాడరాదని ఫిక్సయ్యుంటారు.

మరి బ్యానర్ పేరును 'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్' అని పెట్టుకుని.. ఇలా వేరే అవతారాలను కొనియాడుతున్నందుకు తిరుపతి బాలాజీకి కోపమొచ్చే.. ఇన్ని ఫ్లాపులిచ్చారేమో అంటూ రాజు గారు ఛమత్కరించి మరీ.. ఇటువంటి టైటిళ్ళను ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని ఫిక్సయ్యారట. ఆయన క్యాంపులో అవి బ్యాన్!!

,  ,  ,  ,  ,