Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-May-2016 12:37:13
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల్లో అమ్మ కేరక్టర్లు అంటే ఇన్నేళ్లూ ఓ ట్రెండ్ లో ఉండిపోయారు. సెంటిమెంట్ - ఏడుపులు - అప్పుడప్పుడూ బాధ్యతలు.. ఇలాంటి మూస రోల్స్ నుంచి టాలీవుడ్ అమ్మలు బైటకి వచ్చేస్తున్నారు. కొత్త తరం దర్శకులు.. మదర్ కేరక్టర్ ని వైవిధ్యంగా చూపించేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలో జయసుధ పాత్ర ఇలాంటి ట్రెండ్ కు నాంది అనుకోవచ్చు. మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ లో న్యూ ఏజ్ మదర్ రోల్స్ గురించి కాసేపు చెప్పుకుందాం.

బాహబలిలో శివగామిగా రమ్యకృష్ణ చేసిన పాత్ర చాలా పవర్ ఫుల్. ఇలాంటి అమ్మ రోల్ అందరికీ దక్కేది కాదు. కొడుకులిద్దరినీ సమానంగా చూస్తూనే రాజ్యాన్ని పరిపాలించే ఆ పాత్రను రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సునందగా నదియ చేసిన రోల్ సినిమాకి కీలకం. ఈ పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది. అలాగే చాలా నిబ్బరంగా - నిశ్చితాభిప్రాయాలతో ఉండే పాత్ర ఇది.

రామ్ చరణ్ మూవీ ఎవడులో జయసుధ చేసిన అమ్మ పాత్ర చాలా కూల్ గా కనిపించినా.. కొడుకుపై ఎనలేని నమ్మకాన్ని కనబరుస్తుంది. ఏ సమయంలోనూ తన నిబ్బరాన్ని కోల్పోని ఈ అమ్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కళ్యాణ వైభోగమే చిత్రంలో ఐశ్వర్య చేసిన మదర్ రోల్ కొడుకుని ఎంతో ప్రేమిస్తుంది. పబ్ కి వెళ్లి తాగి పడిపోయిన కొడుకుకి నవ్వుతూ చేయి అందించే ఈ పాత్రకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజులో పవిత్ర చేసిన తల్లి పాత్ర అద్భుతం. కొడుకుని ఓ అథ్లెట్ గా తీర్చిదిద్దేందుకు తపన పడ్డంతో పాటు.. ప్రేమించరా బాగుంటుంది అని చెప్పగలిగేంతటి ఉత్తమమైన పాత్ర ఇది. సూర్య వర్సెస్ సూర్యలో మధు పోషించిన అదితీ దేవి రోల్ కూడా ఆకట్టుకునేదే. మెలో డ్రామాలు లేకుండా సెంటిమెంట్ సీన్స్ లో కూడా జోక్స్ వేసే మమ్మీ కేరక్టర్ ఇది.

,  ,  ,  ,