Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 11:56:39
facebook Twitter Googleplus
Photo

బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాల్లో ఫిదా కూడా ఒకటి. ఈ సినిమా మొత్తానికి ఒక దర్శకుడికి హీరోకి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం వారి బ్యానర్ లోఅత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఫిదా దాదాపు రూ.50 కోట్ల మార్క్ ని అందుకుంది. దీంతో వరుణ్ తేజ్ కూడా బాక్స్ ఆఫీస్ షేక్ చేసే హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే స్థాయిలో బిజినెస్ అవ్వాలని సినిమాలను ఒకే చేస్తున్నాడు.

అయితే ప్రస్తుతం వరుణ్ తొలిప్రేమ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమాను బివిఎస్ ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా థ్రియేటికల్ రైట్స్ ను దిల్ రాజు కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.18 కోట్లకు దిల్ రాజు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే ఒక హీరో సినిమా మంచి హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి బిజినెస్ కూడా పెరుగుతుంది.

ఫిదా సినిమా 50 కోట్లను క్రాస్ చేస్తే.. వరుణ్ నెక్స్ట్ సినిమా మార్కెట్ కూడా పెరుగుతుంది. కానీ దిల్ రాజు 18 కోట్లకు మాత్రమే కొన్నాడు. అయితే దర్శకుడిని దృష్టిలో పెట్టుకోని ఆ రేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే బడ్జెట్ గురించి కూడా అలోచించి ఉండవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఇక తొలిప్రేమ శాటిలైట్ రైట్స్ ని మంచి రేట్ కి సన్ నెట్ వర్క్ కొనుగోలు చేసింది.

,  ,  ,  ,  ,  ,