Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 17:05:28
facebook Twitter Googleplus
Photo

నిన్నటిరోజున రుద్రమదేవి సక్సెస్ మీట్ లో అనుకోని ఘటన అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. రుద్రమదేవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ముందుకొచ్చాను.. అంటూ చెప్పిన దిల్ రాజు ఉన్నట్టుంది ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. గుణశేఖర్ దర్శకత్వం వహించే ప్రతాపరుద్రుడు చిత్రం నేనే నిర్మిస్తానని అన్నాడు. అసలు రుద్రమదేవి అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే అది పూర్తవ్వకుండానే గుణశేఖర్ ఈ సినిమా తీస్తానని అంటే ముందు అది పూర్తి చేయవయ్యా అని అన్నాను. ఇప్పుడు చెబుతున్నా ప్రతాపరుద్రుడుకి నేనే నిర్మాత.. అని సగర్వంగా ప్రకటించాడు.

ఆ టైమ్ లో ఎంతో ఎమోషన్ అయిన గుణశేఖర్ నేరుగా దిల్ రాజుని ఉద్ధేశిస్తూ... నా కొత్త సినిమాకి నిర్మాత దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు రుద్రమదేవి 3డి తెరకెక్కించడానికి దిల్ రాజు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమా తీస్తున్నప్పుడు సినిమా కథాంశంతో పాటు ప్రతి విషయంలో చర్చించి తెరకెక్కించడానికి అన్నిరకాలా ప్రోత్సాహాన్నిచ్చారు. ... అంటూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు గుణ. మొత్తానికి రుద్రమదేవి విజయం చారిత్రాత్మకం. చరిత్ర బేస్ చేసుకుని ప్రతాపరుద్రుడు సినిమా తీస్తానని ప్రకటించారు కాబట్టి.. ఈసారి దాని రేంజు ఓ రేంజులో ఉండేలా గుణశేఖర్ ప్లాన్ చేయాల్సిందే.

,  ,  ,