Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 11:46:50
facebook Twitter Googleplus
Photo

నిన్న జనతా గ్యారేజ్ సెట్లో న్యూ ఇయర్ హంగామా కనిపించింది. ఒకరికొకరు ఆత్మీయంగా హత్తుకొని గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. స్వీట్లు తినిపించుకొన్నారు. కానుకలు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. అసలు న్యూ ఇయర్ హంగామా ఇప్పుడేంటి? జనవరి 1 ఎప్పుడో అయిపోయింది కదా ఇక తెలుగు సంవత్సరాది అంటారా? అది కూడా మొన్న 8వ తేదీనే చేసుకున్నాం కదా అంటారా! నిజమే కానీ జనతా గ్యారేజ్ సెట్లో జరిగింది మలయాళం న్యూ ఇయర్ హంగామా. ప్రతీ యేటా మన ఉగాది తర్వాత తమిళ్ - మలయాళంకి సంబంధించిన కొత్త యేడాది వస్తుంటుంది. మనం ఉగాది అని ఎలా అంటామో మలయాళీయులు దాన్ని విషు అని పిలుచుకుంటుంటారు.

జనతా గ్యారేజ్ సినిమాలో మలయాళం స్టార్స్ మోహన్ లాల్ - ఉన్ని ముకుందన్ లు నటిస్తున్నారు. షూటింగ్ కోసం వాళ్లు హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి విషు వేడుకల్ని వాళ్లు ఇక్కడే జనతా గ్యారేజ్ సెట్లో జరుపుకొన్నారు. పండగ స్పెషల్ గా వండుకొనే కణి అనే స్వీట్ ని మోహన్ లాల్ స్వయంగా తయారు చేయించి సెట్ కి తీసుకొచ్చారట. ఆ స్వీట్ ని ఎన్టీఆర్ ఇష్టంగా ఆరగించాడట. ఆ తర్వాత మోహన్ లాల్ ఓ కానుకని ఎన్టీఆర్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇచ్చాడట.

ఎన్టీఆర్ కూడా ఓ కానుకని తెప్పించి మోహన్ లాల్ కి ఇచ్చారట. మొత్తంగా ఎన్టీఆర్ ఈ యేడాది ఇప్పటిదాకా మూడు న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకొన్నాడన్నమాట. అయితే జనతా గ్యారేజ్ సెట్లో మాత్రం ఎన్టీఆర్ మొదలుకొని చిత్రబృందం మొత్తం మోహన్ లాల్ చుట్టూనే తిరుగుతుంటుందట. ఆయన అందరితోనూ అంతగా కలిసిపోయారట. మోహన్ లాల్ తెలుగు కూడా నేర్చేసుకొంటున్నాడు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ జనాలు ఆయన్ని ఇక వదిలిపెట్టే అవకాశాలేవని తరచుగా ఆయనకి పాత్రలు అప్పజెప్పే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,