Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 10:29:23
facebook Twitter Googleplus
Photo

లోఫర్ సినిమాలో సెక్సీ కాస్ట్యూమ్స్ లో పిచ్చెత్తించింది దిశా పటానీ. ఆ తరువాత అమ్మడి ఫోటో షూట్లతో టాలీవుడ్ ఠారెత్తిపోయింది. అసలు ఆ రేంజు గ్లామర్ మన హీరోయిన్ల దగ్గర లేదంటే అతిశయోక్తి కానేకాదు. కాకపోతే లోఫర్ సినిమా డిజాష్టర్ కావడంతో పటానీని పటాయించి అవకాశాలిచ్చే ఫిలిం మేకర్లు ఇక్కడెవ్వరూ లేరు.

సరే ఇప్పుడు అసలు మ్యాటర్ కు వెళిపోతే.. అమ్మడు తొలిసారిగా బాలీవుడ్ స్ర్కీన్లో మెరిసింది ఏ సినిమాతోనో తెలుసా? అమ్మడు 'ఎం.ఎస్.దోని' సినిమాతో బాలీవుడ్ తెర మీద అడుగుపెట్టిందని చెప్పాలి. అయితే తెలుగులో ఈ సినిమాను చూసినవారిలో చాలామంది.. అవునా? దిశా పటానీయా? అసలు ఆ సినిమాలో ఎక్కడుందబ్బా అంటున్నారు. ఇలా లోఫర్ పాపను మనోళ్ళు గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటంటే.. అమ్మడు ఈ సినిమాలో ధోని మొదటి ప్రియురాలు ప్రియాంకా ఝా పాత్రలో చక్కగా చూడిదార్లు వేసుకుని పద్దతిగా కనిపించింది. అందుకే మనోళ్ళు పోల్చుకోలకపోయారు.

ఇకపోతే ఆ పాత్రలో దిశా పటానీ క్యూట్ గా బాగానే ఉందిగాని.. పాత్రను మలచిన తీరు పెద్దగా డైనమిక్ గా లేకపోవడంతో (మేబీ రియాల్టీలో అలాగే ఉండేదేమోలే ఆ అమ్మాయి) బాలీవుడ్ లో ఈమెకు బోలెడన్న అవకాశాలు వస్తాయని అనుకోలేం.

,  ,  ,  ,  ,