మరో పెద్ద పండగొచ్చేసింది. ఇలా ఏ పండగ వచ్చినా సినిమా వాళ్లు కూడా పండగ చేసుకుంటారు. సెట్స్ మీద ఉన్న సినిమాలకు సంబంధించిన ఏవో విశేషాల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. దీపావళికి కూడా కొన్ని క్రేజీ సినిమాల విశేషాలు బయటికి రాబోతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాకు సంబంధించి ఒక లుక్.. ఒక మేకింగ్ వీడియోతో అభిమానులకు డబుల్ ధమాకా వినోదాన్ని అందించబోతున్నారని టాక్. పక్కాగా ఏం చూపించబోతున్నారన్నది చెప్పలేదు కానీ.. దర్శకుడు సుజీత్ సైతం ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఉంటుందని కన్ఫమ్ చేశాడు.
మరోవైపు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా ఎంసీఏ ఫస్ట్ లుక్ దీపావళి కానుకగా రిలీజవుతుందని అధికారిక సమాచారమే వచ్చేసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ లుక్ బయటికొస్తుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటల్ ను దీపావళికే ప్రకటిస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రంగస్థలం కు సంబంధించిన విశేషాలు వెల్లడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక ముందు అనుకున్న ప్రకారమైతే మహేష్ బాబు కొత్త సినిమా భరత్ అను నేను ఫస్ట్ లుక్ కూడా దీపావళికే రావాల్సింది. కానీ ఆ సినిమా సంక్రాంతి నుంచి వేసవికి వెళ్లిపోవడంతో ఈ ఆలోచన మానుకున్నారు