Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 12:45:59
facebook Twitter Googleplus
Photo

ఒక ట్రైలర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్త ట్రైలర్ ను దించాడు డిజె దువ్వాడ జగన్నాథమ్. అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరక్షన్లో.. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా కొత్త ట్రైలర్లో మామూలు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించలేదనుకోండి. అదే ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయిపోయింది.

ప్రెజెంటింగ్ యు ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టయినింగ్ క్యారెక్టర్ అంటూ ఒక సీన్లో అల్లు అర్జున్ తన గురించి తానే చెప్పుకునే డైలాగ్ తో ఈ ట్రైలర్ తో ఓపెన్ అవుతుంది. ఇక మనోడు రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహా అంటూ గతంలో లవ్ గురించి చెప్పిన సంస్కృత విభక్తి తరహాలో ఇప్పుడు కూడా మరొకటి పేల్చాడు. మరోచోట చెప్పిన డైలాగ్ చూస్తే.. కొడుతున్నాం సార్. గట్టిగా కొడుతున్నాం అంటాడు. ఈ డైలాగులు సినిమాలో సందర్భానికి సెట్టయ్యేవే అయ్యుండొచ్చు కాని.. ఇప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గురించే చెబుతున్నారు అనే భావన వస్తోంది. అలా రావాలనే ఈ ట్రైలర్ కట్ చేశారని అనిపిస్తోంది. ఎండింగ్ లో వచ్చే డైలాగ్ చూసుకుంటే.. మనంగానీ అనుకోకుండా చాడీలు చెప్పేశాం ఏంట్రా?'' అని బన్నీ అడిగితే.. అబ్బే వాస్తవాలు అయితేనూ అంటూ అవతలి వ్యక్తి రిప్లయ్ ఇస్తాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అంతే అంటూ ఇన్ డైరక్టుగా ఈ విధంగా మెసేజులు ఇస్తున్నారు అల్లు అర్జున్ అండ్ హరీశ్ శంకర్ అని చాలామంది అభిప్రాయం.

,  ,  ,  ,  ,