Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 10:10:57
facebook Twitter Googleplus
Photo

ప్రతి శుక్రవారం పండుగే. కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుంటుంది. ఒక్కోసారి మూణ్ణాలుగు సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలుంటాయి. అయితే... రానున్న శుక్రవారం టాలీవుడ్ కు మరింత స్పెషల్ శుక్రవారం. ఎందుకంటే... ఆ రోజున ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే తమిళంలో హిట్ అయినవి కూడా ఉండడంతో ఈ ఫ్రైడే రేసులో ఏది నిలుస్తుందో అన్న చర్చ టాలీవుడ్ లో సాగుతోంది.

గోపిచంద్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఆక్సిజన్ ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదాపడి ఇప్పుడు విడుదలవుతోంది. దీనిపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇదేసమయంలో ప్రయోగాత్మక సినిమాలు చేసే కార్తీ కూడా ఈ నెల 17న ఖాకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

యువత ప్రేమకు పెళ్ళికి ఎంత తొందర పడుతున్నారో అంత త్వరగా విడిపోతున్నారన్న కాన్సెప్ట్తో ‘లండన్ బాబులు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్ని కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.

అవల్ పేరుతో విడుదలైన సినిమా తెలుగులో గృహం పేరుతో విడుదల కానుంది. సిద్ధార్థ్ నటిం చిన ఈ సినిమా అక్కడ విజయవంతం అయ్యింది. ఈ సినిమాతో సిద్ధార్ధ మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

,  ,  ,  ,  ,