నాగార్జున హీరోగా ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయన' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంటును జోడించారని చెబుతున్నారు. 1983లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'రాముడు కాదు కృష్ణుడు' చిత్ర కథ ఛాయల్లో ఇప్పుడీ చిత్ర కథ సాగుతుందని అంటున్నారు. ఆ సినిమాలో కూడా ఏఎన్నార్ రెండు పాత్రలు వేశారు. చనిపోయిన పాత్ర ఆత్మ రూపంలో వచ్చి మరో పాత్రకు సహాయం చేస్తుంటుంది. ఇదే పాయింటును ఇప్పుడు 'సోగ్గాడే'లో కూడా పెట్టినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పొతే, ఇందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
nagarjuna, lavanyatripati, ramyakrishna, soggadechinninayana, fantasy,