Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 12:13:44
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు అందరూ కూడా దంగల్ సినిమాలోని ఇద్దరి అమ్మాయిల గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అమీర్ ఖాన్ పెద్ద కూతురుగా చేసిన ఫాతిమా సనా షేక్.. అలాగే చిన్న కూతురుగా చేసిన సాన్యా మల్హోత్రా గురించే చర్చంతా. వీరిద్దరూ గీతా ఫోగట్.. బబితా ఫోగట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ భామలు అసలు ఈ పాత్రల కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా?

నిజానికి ఫాతిమా అండ్ సాన్యాలు ఏకంగా మూడు నెలలపాటు కేవలం ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నారట. ఇద్దరూ ముందుగా ఒకే పాత్ర కోసం ఆడిషన్ చేయగా.. తరువాత ఇద్దరికీ చెరో పాత్రను అప్పజెప్పారు. అయితే ఆడిషన్స్ అయిపోయాక వీరికి కుస్తీల్లో ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒక నెలంతా చాలా దెబ్బలు తగిలాయట. వంట్లో పులసు కారిపోయేది అంటున్నారు. కాని ఈ విషయం అమీర్ ఖాన్ కు కాని.. ఇతర కోచ్ లకు కాని చెప్పలేదట. ఒకవేళ దెబ్బలు తగిలాయి అని చెబితే దంగల్ సినిమాలోనుండి వీరిని తీసేస్తారేమోనని భయం వేసిందట. పైగా ఈ భయంలో ఈ అమ్మాయిలు ఇద్దరూ మాంచి స్నేహితురాళ్ళు కూడా అయిపోయారు. అంత కష్టపడటం వలనే చివరకు స్ర్కీన్ పై అటు యాక్టర్లు.. నిజమైనా కుస్తీ యోధురాళ్ళలా ఇంప్రెస్ చేయగలిగారు.

ప్రస్తుతం ఈ ఇద్దరూ ఇతర సినిమా ఆఫర్లను చేజ్ చేయకుండా.. ఇద్దరూ కూడా అమీర్ ఖాన్ దగ్గర ఇంటర్నెషిప్ చేస్తున్నారట. దర్శకత్వం టు యాక్టింగ్.. అన్నీ నేర్చుకుంటున్నారట. మరి వీరి రెండో సినిమా ఎవరితో చేస్తారూ ఎలాంటి మూవీ చేస్తారూ అనే విషయంపై ఇంకా వారికే క్లారిటీ లేదంటున్నారు. అయితే ఇప్పటికే సాన్యా చాలా యాడ్స్ లో నటిస్తుండగా.. ఫాతిమా కు మాత్రం ఇప్పటివరకు ఒక్క యాడ్ ఆఫర్ కూడా రాలేదట. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,