హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందనే వాదన చాలా కాలం నుండి వినిపిస్తున్న మాట. దీనిపై గతంలో పలు ఆందోళనలు, ప్రభుత్వ పెద్దలకు విన్నపాలు జరిగినా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. పరిశ్రమలో ఎక్కువగా పెద్ద నిర్మాతలు, భారీ సంఖ్యలో థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద హీరోల ఆధిపత్యమే నడుస్తోంది. దీంతో చిన్న సినిమాలు విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు తీసిన సినిమాలకు వందల సంఖ్యలో థియేటర్లు లభిస్తాయి... కానీ చిన్న సినిమాలకు పట్టుమని పది థియేటర్లు కూడా దక్కని దుస్థితి. దీంతో వ్యయ ప్రయాసల కోర్చి తెరకెక్కించిన చిన్న సినిమాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. తాజాగా ఈ రోజు విడుదలకు సిద్దమైన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' సినిమా విషయంలో ఇలాంటి వివాదమే చోటు చేసకుంది. తమకు తొలు 30 థియేటర్లు కేటాయిస్తామని చెప్పిన డిస్ట్రిబ్యూటర్ ఇపుడు కేవలం 3 థియేటర్లే కేటాయించడంతో ఈ రోజు రిలీజ్ కావాల్సిన సినిమా దాదాపు ఆగిపోయింది