Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 13:56:15
facebook Twitter Googleplus
Photo

సన్ రైజర్స్ హైద్రాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ సీజన్ ప్రారంభించి.. సూపర్బ్ ఆట తీరును కనబరిచింది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ లను గెలిచి.. పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో ఉంది. టాలీవుడ్ నుంచి చాలామంది తారలే సన్ రైజర్స్ ను సపోర్ట్ చేస్తున్నారు. నేరుగా స్టేడియంకు వచ్చి మరీ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

గుజరాత్ లయన్స్ తో సన్ రైజర్స్ తన సెకండ్ మ్యాచ్ ఆడి నెగ్గేసింది. ఈ మ్యాచ్ కు టాలీవుడ్ యంగ్ హీరోస్ అఖిల్.. సాయి ధరం తేజ్ లతో పాటు సురేష్ బాబు.. వెంకటేష్.. పూనమ్ కౌర్ లు కూడా హాజరయ్యారు. అయితే.. ఈ మ్యాచ్ కి వచ్చిన ఆడియన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం జూనియర్ సూపర్ స్టార్. అదేనండీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్. సన్ రైజర్స్ జెర్సీని ధరించి మరీ మ్యాచ్ ఆసాంతం ఎంజాయ్ చేశారు. ప్రతీ ఫోర్ కి.. సిక్స్ కి చప్పట్లు కొడుతూ ఆనందించాడు. మరింత మంది పిల్లలతో కలసి మ్యాచ్ ను వీక్షించాడు గౌతమ్.

ఈసారి ఐపీఎల్ ప్రారంభం నుంచే బాగా ఆసక్తిని కలిగిస్తోంది. తారలంతా ఆయా జట్లకు మద్దతు పలకుతుండడంతో.. ఐపీఎల్ కు గ్లామర్ కూడా తోడైంది.

,  ,  ,  ,  ,