Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 13:05:36
facebook Twitter Googleplus
Photo

. డ్రగ్స్ కేసులో సంబంధం ఉందంటూ తెలిసీ తెలియనట్లుగా వార్తలు వచ్చే స్థానే.. ఈ రోజు పలు మీడియా సంస్థలు నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వీరే అంటూ జాబితాను బయట పెట్టేయటం తెలిసిందే. అయితే.. మీడియాలో వచ్చిన పేర్ల విషయంలో పలువురు ఖండనలు మొదలు పెట్టారు. డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ నోటీసులు వచ్చినట్లుగా చెబుతున్న వారికి సంబంధించి.. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే గొంతు విప్పుతున్నారు.

ఇలా వాయిస్ ఓపెన్ చేసిన మొదటి సెలబ్రిటీగా గాయని గీతామాధురిగా చెప్పాలి. డ్రగ్స్ ఉదంతంలో నోటీసులు అందుకున్న డర్టీ డజన్ లో గీతామాధురి భర్త నందు కూడా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. తన భర్త నందుకు డ్రగ్స్ కు సంబంధం లేదని.. అతను డ్రగ్స్ కు తీసుకునేంతగా దారి తప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్ ముఠాతో నందూకి ప్రమేయం ఉన్నట్లుగా వస్తున్న వార్తల్ని ఆమె తప్పు పట్టారు. తీవ్రంగా ఖండించారు.

గాయని గీతామాధురితో పాటు.. డ్రగ్స్ ఇష్యూలో నోటీసులు ఇచ్చిన వారి జాబితాలో పేరున్నట్లుగా చెబుతున్న నందు సైతం మీడియాకు అందుబాటులోకి వచ్చారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదన్నారని..అలాంటిది తన పేరు మీడియాలో రావటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలంటే ఏ పరీక్షకైనా తాను సిద్ధమన్నారు. తనను ఈ కేసులో ఇరికించే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా తొందరపాటుతో వ్యవహరించే కన్నా.. వాస్తవాలు తెలుసుకొనొ బయటకు తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. డ్రగ్స్ లిస్ట్ లో పేరు ఉన్నట్లుగా చెబుతున్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా కూడా తన పేరు రావటంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇప్పటివరకూ ఎలాంటి నోటీసులు రాలేదని.. కానీ.. ఇలాంటి వార్తల కారణంగా తన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందని చెప్పాడు.

,  ,  ,  ,