Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Aug-2016 11:17:02
facebook Twitter Googleplus
Photo

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం. 150 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మెగాస్టార్ తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పట్నుంచే మొదలయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే చిరు 151వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారన్నది తెలియనుంది.
మెగా ఫ్యామిలీకి చెందిన బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. 150వ సినిమాలానే ఆ తర్వాత వచ్చే సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అల్లు అరవింద్ ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక చిరు 150వ సినిమా ?ఖైదీ నెం 150? విషయానికి వస్తే, తమిళంలో ఘన విజయం సాధించిన ?కత్తి?కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

,  ,  ,  ,  ,  ,  ,