ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతుంది. సుకుమార్ మూవీ అంటే స్క్రీన్ ప్లే, డీటైలింగ్ కు పెట్టింది పేరు. ఇక మాస్, యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తో పాటు నటన పరంగా ది బెస్ట్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దానిపై ఏస్థాయిలో అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకు తగ్గట్లుగానే నిర్మాతలు ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు.
ఇక గత కొన్నిరోజుల క్రితం లండన్లో పెద్ద ఎత్తున మొదలైన షెడ్యుల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలోనే ఈ సినిమాకి సంబదించిన శాటిలైట్ రైట్స్ అప్పుడే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ జెమిని టీవీ సొంతం చేసుకున్నది. భారీ మొత్తానికి జెమిని టీవీ ఈ సినిమా హక్కులని పొందినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.