Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 15:30:31
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన రానా, తాజాగా ఘాజీ అనే నావికాదళ యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమాతో వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక ఈ సినిమా నేటితో సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం సినిమాకు యూ సర్టిఫికెట్ జారీ చేసింది.
పీవీపీ సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. రానా చేసిన ఈ డిఫరెంట్ ప్రయత్నానికి రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి క్రేజ్ కనిపిస్తోంది. అదేవిధంగా హిందీలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ, కేకే మీనన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

,  ,  ,  ,  ,