Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2016 13:08:32
facebook Twitter Googleplus
Photo

సాధారణంగా గోపి చంద్ అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కి, పెద్ద పెద్ద ఫైటింగులకి కేరాఫ్ అడ్రస్. ఆయన నటించే ప్రతి సినిమాలోనూ అలాంటి యాక్షన్ సన్నివేశాలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం గోపి చంద్ నటిస్తున్న ?ఆక్సిజన్? సినిమాలో సైతం అలాంటి యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయట. వాటిలో గోపీ చంద్ డూపులను పక్కన పెట్టి అన్ని స్టంట్స్ ఆయనే స్వయంగా చేస్తున్నారట.
ఇది కాస్త రిక్స్ అయినప్పటికీ ఫైట్ లో క్లోజప్ షాట్లు ఎక్కువగా ఉండటంతో డూపులు వాడితే సహజత్వం, ఫైట్ లోని ఇంటెన్సిటీ మిస్సవుతాయని గోపి చంద్ ఈ డెసిషన్ తీసుకున్నాడట. ఇది ఏమైనా సినిమా పట్ల గోపి చంద్ అంకితభావం అభినందించదగ్గదే మరి. ఇకపోతే ?ఏ.ఎం. రత్నం? నిర్మిస్తున్న ఈ సినిమాకి ?జ్యోతి కృష్ణ? దర్శకత్వం వహిస్తుండగా గోపి చంద్ సరసన ?రాశి ఖన్నా? హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,