Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2015 14:41:20
facebook Twitter Googleplus
Photo

యువ కథానాయకుల్లో మంచి జోష్ చూపించే కథానాయకుడిగా సాయిధరం తేజ్ మార్కులు కొట్టేశాడు. ఒక వైపున యూత్ ని .. మరోవైపున మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ తన కెరియర్ స్పీడు పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాతో త్వరలో సందడి చేయనున్న తేజ్, అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు.

ఇక తాజాగా సునీల్ రెడ్డి వినిపించిన కథకి కూడా ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ కథ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తోడుగా చేసుకుని ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందని అంటున్నారు. గతంలో కల్యాణ్ రామ్ తో 'ఓం' అనే చిత్రాన్ని సునీల్ రెడ్డి తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను శ్రీలంక పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు అనిల్ రావిపూడి .. ఇటు సునీల్ రెడ్డి సినిమాలను ఒకే సమయంలో చేసే విధంగా తేజ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

,